ఆశ వర్కర్ల సమస్యల సాధనకు పోరాటం చేస్తామని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి. జ్యోతి తెలిపారు. పెద్దపల్లిలో ఆదివారం రాష్ట్ర బస్సు జాత గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాత ఈనెల 17న పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రానున్న సందర్భంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జ్యోతి, వెంకటేశ్వరి, అరుణ, పద్మలు పాల్గొన్నారు.