ఆధునిక సాంకేతికత పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి విస్తృతంగా పర్యటించి మంథని జూనియర్ కళాశాల మైదానంలో రూ. 35 లక్షల నిధులతో చేపట్టిన సింథటిక్ టెన్నిస్ కోర్టు, రూ. 10 లక్షలతో చేపట్టిన చిల్డ్రన్ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.