శాసనమండలి సభ్యుల ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుండి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణుతో కలిసి వీడియో సమావేశంలో పాల్గొన్నారు.