ఆశా వర్కర్లకు నికర వేతనం నెలకు రూ. 18 వేలు ప్రకటించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్- సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. హామీ ఇచ్చినట్లుగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రూ. 18 వేల ప్రకటన చేసేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జ్యోతి, జిల్లా కార్యదర్శి రజిత పాల్గొన్నారు.