సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని జేఎన్టీయూహెచ్ జాక్ స్టేట్ కన్వీనర్ ఆకుల స్వామి వివేక్ అన్నారు. సోమవారం పెద్దపల్లిలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక దీక్ష శిబిరాన్ని 21వ రోజు సందర్శించి మద్దతు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19, 600 మంది ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైబ్రెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అల్పాహారం అందజేశారు.