పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లిలో మంగళవారం ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు గొర్రెలను మేతకు తీసుకువెళ్లగా.. నీరు తాగడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాయి. అక్కడ విద్యుత్ షాక్ తగిలి సుమారు 100 గొర్రెలు మృతి చెందాయి. దీంతో గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరుతున్నారు.