పెద్దపల్లి మండల విద్యా వనరుల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నెట్ బాల్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, పవర్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ రాష్ట్రస్థాయి జట్టుల్లో పాల్గొనే క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి జట్ల క్రీడాకారులకు జడ్పీ సీఈవో నరేందర్, జిల్లా విద్యాధికారి మాధవి, బైసీ వెల్ఫేర్ ఆఫీసర్ రంగారెడ్డి చేతులమీదుగా టీ షర్ట్స్ అందించి శుభాకాంక్షలు తెలిపారు.