రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుంది: పురందేశ్వరి
విజయవాడలో సోమవారం బీజేపీ సంస్థాగత నిర్మాణ కార్యశాల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ మేరకు బీజేపీ సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జ్గా పాకా సత్యనారాయణను నియమించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ‘నవంబర్ 15 వరకు రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగనుంది. కేవలం 40 రోజుల్లోనే సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకున్నాం. రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుంది.’ అని అన్నారు.