పట్టణ అభివృద్ది పనులపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి అన్నారు. బుధవారం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ మమత రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించగా, ఎజెండా అంశాలు, వార్డులలో చేయాల్సిన పనులపై చర్చించి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సమావేశంలో కమిషనర్ ఆకుల వెంకటేష్, వైస్ చైర్ పర్సన్ నాజీమ్ సుల్తానా, కౌన్సిలర్లు పాల్గొన్నారు.