జూలపల్లి: మాజీ ఎమ్మెల్యే పరామర్శ, చేయూత

51చూసినవారు
జూలపల్లి: మాజీ ఎమ్మెల్యే పరామర్శ, చేయూత
జూలపల్లి మండల కేంద్రంలో ముమ్మాడి రవి మాతృమూర్తితో పాటు ఎండి అజ్ఘర్ పాషాలు ఇటీవల అనారోగ్యంతో మరణించగా, శనివారం వారి కుటుంబ సభ్యులను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ లు పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం నేనున్నా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక్కో కుటుంబానికి 50 కిలోల చొప్పున బియ్యాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్