రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. ఆదివారం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏఎంసీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరై నూతన మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, వైస్ చైర్మన్ కూర మల్లారెడ్డి, పాలకవర్గాన్ని సత్కరించారు. ఎమ్మెల్యే సమక్షంలో పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ పాల్గొన్నారు.