క్రిస్టియన్ సోదరుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. మంగళవారం పెద్దపల్లిలోని డీసెంట్ ఫంక్షన్ హల్ లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు ముందస్తు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్ రావు పాల్గొన్నారు.