సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడు కల్లెపల్లి శంకర్ గత 9 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. పేద కుటుంబం కావడం, తన తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతున్న విషయమై దాతలు సహకరించాలని మాజీ ఎంపిటిసి మండల రమేష్ సామాజిక మాధ్యమం ద్వారా విజ్ఞప్తి చేదారు. దాతల ద్వారా సేకరించిన రూ. 16 వేలను గురువారం గ్రామ ప్రజల సమక్షంలో శంకర్ సోదరి ప్రమీలకి అందజేశారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.