
నేడు సర్ ఆర్ధర్ కాటన్ జయంతి
సర్ ఆర్థర్ కాటన్ ఒక బ్రిటిష్ సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. గోదావరి ప్రజలు ఆయనను "కాటన్ దొర"గా అభిమానించేవారు. బ్రిటిష్ పరిపాలనలో నీటిపారుదల, నావికా కాలువల నిర్మాణానికి తన జీవితాన్ని అర్పించాడు. ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించి, గోదావరి జలాలతో లక్షల ఎకరాలకు సాగునీరు అందించాడు. 1819లో మద్రాసు ఇంజనీర్ల దళములో చేరి, మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. 1861లో సర్ బిరుదు పొందాడు. మే 15న ఆయన జయంతి.