ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

69చూసినవారు
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
ఎలిగేడు మండల కేంద్రంతో పాటు ధూళికట్ట గ్రామంలో మంగళవారం ఎరువుల దుకాణాల్లో మండల వ్యసాయాధికారి ఉమాపతి తనిఖీలు నిర్వహించారు. ఎరువుల వివరాలను ఈ పాస్ మెషీన్ తో సరిచూశారు. ఎరువుల విక్రయాలను ఈ పాస్ లో నమోదు చేయాలని, స్టాక్ రిజిస్టర్, బిల్లు బుక్కులు ప్రతి రోజూ సవరించాలని, రైతులకు సరిపడ ఎరువులు ఉంచాలని సూచించారు. అలాగే ధూళికట్ట, ఎలిగేడు గ్రామాల్లో పంట వివరాలను సేకరించి నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్