అంతర్జాతీయ ఖోఖో దినోత్సవం

81చూసినవారు
అంతర్జాతీయ ఖోఖో దినోత్సవం
సుల్తానాబాద్ తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణంలోని ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ లో ఆదివారం అంతర్జాతీయ ఖోఖో దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ సీనియర్ ఖోఖో క్రీడాకారుడు బైరగోని రవీందర్ గౌడ్ కేక్ కట్ చేశారు. ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ కోచ్, భారత జట్టు మాజీ క్రీడాకారుడు గెల్లు మధుకర్ యాదవ్ ను ఘనంగా సత్కరించారు. వేడుకల్లో జాతీయ సీనియర్ క్రీడాకారులు మహేందర్, ఎక్బాల్, పీడీ ప్రణయ్, పవన్ పాల్గొన్నారు.