మంథని: మినీ ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగ

64చూసినవారు
పెద్దపల్లి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. మంథని మండలం గుంజపడుగులోని మినీ ఏటీఎంకి ఓ దొంగ ముసుగు వేసుకొని శుక్రవారం వచ్చాడు. సిబ్బందిని కత్తితో బెదిరించాడు. డబ్బు దోచుకోవాలని యత్నించాడు. ఈ హఠాత్పరిణామానికి సిబ్బంది భయపడ్డారు. అదే సమయంలో కొందరు స్థానికులు రావడంతో అక్కడి నుంచి దొంగ పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్