పెద్దపల్లి: వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

70చూసినవారు
పెద్దపల్లి: వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, హెల్త్ వెల్ నెస్ కేంద్రాలలో పని చేసే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు సమయపాలన పాటించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. అన్నప్రసన్న కుమారి ఆదేశించారు. గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ లో ఎంఎల్‌హెచ్‌పీల విధులపై సమీక్ష జరిపారు. సమయ పాలన పాటించి ఒపి శాతం పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డా. రవిసింగ్, డా. రాజమౌళి, డా. వాణీశ్రీ, డా. శ్రీరాములు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్