పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో శ్రీ భూగోదా సమేత రంగనాధస్వామి బ్రహ్మోత్సవాల సందర్బంగా పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే విజయరమణరావుని వేద మంత్రాల సాక్షిగా ఆశీర్వదించి ఘనంగా సన్మానించారు. అలాగే బొంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేని శాలువాలతో ఘనంగా సత్కరించారు.