ఓదెల: ప్రమాద భీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

51చూసినవారు
ఓదెల: ప్రమాద భీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన వేల్పుల రాజకొమురయ్య మేకలు, గొర్రెలు ఇటీవల విద్యుత్ ఘాతానికి మరణించగా, విద్యుత్ శాఖ ద్వారా ప్రభుత్వం నుండి రూ. 1, 75, 000 విలువ గల ప్రమాద భీమా చెక్కు మంజూరైంది. సోమవారం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి నష్టపోయిన రాజకొమురయ్యకి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు చెక్కును అందజేశారు. ఈకార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్