
దారుణమైన పరిస్థితుల్లో నటుడు కోటా శ్రీనివాసరావు
విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేశారు కోట శ్రీనివాసరావు. విలన్, కమెడియన్ వంటి విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఆయన ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన కాళ్లు పూర్తిగా దెబ్బతినగా, షుగర్ ఎక్కువగా ఉండటంతో కాళ్ల వేళ్ళను తీసివేయాల్సిన స్థితి ఏర్పడినట్లు సమాచారం. ఈ వార్తలు సినీ పరిశ్రమలో ఆందోళన కలిగిస్తున్నాయి. కోట త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.