జూలపల్లి మండలం కేంద్రంలోని విత్తన, ఎరువులు, పురుగుమందుల దుకాణాలలో బుధవారం వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. విత్తన రిజిస్టర్లు, బిల్లు ఋక్ లను వ్యవసాయ అధికారిని ప్రత్యూష, కానిస్టేబుల్స్ రాజేందర్, మనోహర్ పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలని, నకిలీ విత్తనాలమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని, విత్తనం కొనుగోలు చేసిన ప్రతి రైతుకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలన్నారు.