పెద్దపల్లి: విద్యుత్ షాక్ తో గొర్రెలు, మేకల మృతి

67చూసినవారు
పెద్దపల్లి: విద్యుత్ షాక్ తో గొర్రెలు, మేకల మృతి
ఓదెల మండలం మడక గ్రామంలో బుధవారం తెల్లవారు జామున విద్యుత్ షాక్ తో గొర్రెలు, మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన వేల్పుల చిన్న కొమురయ్య తన పాకలో గొర్రెలు, మేకల మందను ఉంచగా, ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అవి కాస్త చుట్టూ ఉన్న ఇనుప కంచెను తాకడంతో షాక్ గురై 20కి పైగా మేకలు, గొర్రెలు మృత్యువాత పడ్డాయి. నష్టపోయిన తనను ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.

సంబంధిత పోస్ట్