పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పరిశుభ్రత గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు, పాఠశాలల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. టాయిలెట్లు, కారిడార్లు, నీటి ట్యాంకులు, హ్యాండ్ వాష్ స్టేషన్లు మొదలైనవి శుభ్రంగా ఉంచే విధానంపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు రేపు మండల పాఠశాలల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు.