పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పెద్దపల్లి ట్రాన్స్ కోకు చెందిన బోలోరో క్యాంపర్ వాహనం, బైక్ వేగంగా ఢీకొనడంతో కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామానికి చెందిన యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.