పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని నాగవైన్స్ షాప్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడంపై మందుబాబులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వేసవిలో తీవ్ర ఉక్కపోతతో పర్మిట్ రూమ్‌లో ఫ్యాన్లు లేకపోవడం, పక్కనే ఉన్న టాయిలెట్ల దుర్వాసన వల్ల తాము మానసికంగా ఇబ్బంది పడుతున్నామన్నారు. దీంతో మందుబాబుటు స్వయంగా షాప్ షట్టర్ మూసి రెండు గంటలపాటు ఆందోళన చేపట్టారు. ఓనర్ రాకపోతే షట్టర్ తెరవమని హెచ్చరించారు.