పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ గ్రామానికి చెందిన తాడిశెట్టి సాయికిశోర్(27) ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్ లో రమ్మీ ఆడటానికి వివిధ ప్రైవేట్ లోన్ ఆప్ ల ద్వారా లోన్ లు తీసుకుని కట్టలేక ఈ నెల 6న క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య యత్నం చేసాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. సాయికిశోర్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్వామి తెలిపారు.