ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లిలో జరిగింది. ఎస్ఐ సనత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నవదీప్ గురువారం మధ్యాహ్నం అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. శుక్రవారం నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచామని పేర్కొన్నారు.