పెగడపల్లి మండలం బతికపల్లికి చెందిన పూడూరి లచ్చన్న(46) ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్ళాడు. 5 నెలల క్రితం తన తండ్రి మరణించడంతో గ్రామానికి వచ్చి తిరిగి వెళ్ళాడు. జీతం తక్కువ ఉండటంతో ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక మానసిక వేదనకు గురై తాను ఉంటున్న క్వార్ట్రర్స్ లోనే శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం స్వగ్రామానికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.