పట్టణాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. గురువారం పెద్దపల్లి పట్టణంలో రూ. 16. 30 లక్షల నిధులతో ఐటిఐ కళాశాలలో కాంపౌండ్ వాల్, గ్రౌండ్ నుండి డ్రైనేజీ నిర్మాణం, 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్, ఎల్లమ్మ గుండమ్మ చెరువుపై నూతన పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం కోసం రూ. 27 లక్ష్యాలతో చేపట్టిన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు.