పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం కొలనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది ఆదివారం చేరుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఎన్నికల సిబ్బంది సోమవారం జరిగే పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు.