జూలపల్లి మండల రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట- జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి ప్రత్యూష తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వెయ్యి బస్తాలు అందుబాటులో ఉన్నాయని, ఒక్కో బస్తా 30 కిలోలు సబ్సిడీ మినహా రైతు చెల్లించాల్సిన ధర రూ. 2137. 50గా ఉంటుందన్నారు. ఒక బస్తా రెండు ఎకరాలకు సరిపోతుందని, కావలసిన రైతులు తమ పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు జిరాక్స్ లతో సంప్రదించి తీసుకోవాలన్నారు.