
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.250 పెరిగి రూ.93,200కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.280 పెరిగి రూ.1,01,680కి చేరింది. కేజీ వెండిపై రూ.100 పెరిగి తొలిసారిగా రూ.1,20,100 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి. కాగా, గత 4 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.4,100, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై రూ.3,750 పెరిగింది.