పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన సందర్బంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్ష చేయించుకున్న 20 మందికి శస్త్ర చికిత్స ఉచితంగా చేయించేందుకు శ్రీవైద్య ఫౌండేషన్, యూత్ కాంగ్రెస్ నాయకుడు గుమ్మడి ప్రసాద్ నిర్ణయించారు. శిబిరంలో గుర్తించిన వారిని కంటి ఆపరేషన్ల కోసం ఆదివారం హైదరాబాద్ తరలించారు. ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించి తిరిగి స్వస్థలాలకు చేరుస్తామని తెలిపారు.