పెద్దపల్లి: నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే

57చూసినవారు
పెద్దపల్లి: నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్యే
అకాల వర్షంతో నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. గురువారం ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన రాజ కొమురయ్య 26 మేకలు, గొర్రెలు వర్షం కారణంగా కరెంట్ షాక్ తో మరణించడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రూ. 21, 500 ఆర్ధిక సహాయం అందించారు. ప్రభుత్వ పరంగా కూడా సహాయాన్ని అందిస్తామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్