పెద్దపల్లి జిల్లాలో బుధవారం జరిగిన గణిత పరీక్షకు 99. 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ప్రకటనలో తెలిపారు. గణితం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదన్నారు. పరీక్షకు 7393 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 7385 మంది విద్యార్థులు హాజరయ్యారని, మొత్తం 99. 98గా హాజరు శాతం ఉందని తెలిపారు.