ఏప్రిల్ 14న జిల్లా కేంద్రంలో నిర్వహించే అంబేడ్కర్ జయంతి వేడుకలను ప్రజలందరూ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 14న ఉదయం 10-30 గంటలకు బస్టాండ్ వద్ద అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించే అంబేడ్కర్ జయంతి వేడుకలలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజలు పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.