ఖనిలో ఘనంగా గంగపుత్రుల బోనాల శోభాయాత్ర.!

62చూసినవారు
ఖనిలో ఘనంగా గంగపుత్రుల బోనాల శోభాయాత్ర.!
ఆషాడ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖని ప్రాంత గంగపుత్రులు బుధవారం బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు. గంగపుత్ర మహిళల సొసైటీ ఆధ్వర్యంలో గంగపుత్రుల ఇలవేల్పు గంగమ్మ తల్లికి పట్టణంలోని వీధుల గుండా బోనమెత్తి శోభాయాత్రగా గోదావరి నది ఒడ్డున గంగమ్మ తల్లికి బోనాలు, మంగళహారతులతో ఘనంగా పూజలు చేసి మొక్కులు చెల్లించారు. తాడబోయిన శ్యామల, సునీత, లక్ష్మి, పారుపల్లి రాజలింగం, నారాయణ తదితరులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్