

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం (వీడియో)
ఢిల్లీలోని పిటంపురాలోని శ్రీ గురు గోబింద్ సింగ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లైబ్రరీలో మొదలైన మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చెరుకున్నారు. 11 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు. ఉదయం 9:40 గంటల ప్రాంతంలో మంటల్ని అదుపులోకి తెచ్చామని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు.