

రేవంత్ రెడ్డిపై రెచ్చిపోతూ వీడియో విడుదల చేసిన లేడీ అఘోరి
TG: సీఎం రేవంత్ రెడ్డిపై లేడీ అఘోరీ పలు విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. రేవంత్ ప్రభుత్వాన్ని సర్వనాశం చేసేదాకా ఊరుకోనని తెలిపారు. జోగులాంబ గుడిలో కూడా దర్గా ఉందని, ఆ దర్గాను తీసేస్తానని అన్నారు. రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఈ చేతగాని రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. నీ ప్రభుత్వాన్ని దించే వరకు వదిలిపెట్టనని, నీ అరెస్టులకు కూడా భయపడనని అఘోరీ చెప్పారు.