రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో గుర్తింపు సంఘం- సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో గురువారం జీఎం కార్యాలయంలో ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం నిర్వహించారు. ఏరియాకు సంబంధించిన పలు అంశాలపై జీఎం నాగేశ్వరరావుతో గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి రామచంద్రారెడ్డి, సభ్యులు చర్చించారు. ఏరియా పరిధిలో సమస్యలను అధికారుల ద్వారా వివరాలు తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.