రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో వాటర్ ట్యాంకర్, చెత్త ట్రాక్టర్ టెండర్లలో గతంలో ఉన్న నిబంధనలను కొందరు ఆఫీసర్లు తమకనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్ల కోసం మార్పులు చేశారని, ఈ విషయంలో విచారణ జరిపి బాధ్యులైన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ విశ్వతేజ కోరారు. గురువారం రామగుండం కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందజేశారు.