పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్, అంతర్గాం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. బసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న లేబర్ రూమ్, ఔట్ పేషెంట్ విభాగం, మందుల పంపిణీ విభాగం ఆసుపత్రి ప్రాంగణం, జనరల్ వార్డును కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్ వివరాలు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.