రామగిరి: రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన

74చూసినవారు
రామగిరి: రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన
రామగిరి మండలం సెంటినరీకాలనీలో సోమవారం రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినూత్నంగా అవగాహన కల్పించారు. యమధర్మరాజు వేషధారణతో వాహన చోదకులను అప్రమత్తం చేయించారు. హెల్మట్ ధరించని వారికి ప్రమాదకరమని తెలిపి ధరించిన వారికి పూలిచ్చి అభినందించారు. ఎస్సై చంద్రకుమార్ హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కుటుంబం గురించి ఆలోచించి హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్