కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం అన్ని కార్మిక సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కడారి సునీల్, ఐఎన్ టియుసీ చందర్, ఐఎఫ్ టీయు విశ్వనాథ్, శంకర్, టియుసీఐ నాయకులు వైకుంఠంలు మే 20న సమ్మెను విజయవంతం చేయాలన్నారు.