సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630 /1982 సర్వసభ్య సమావేశం శనివారం శ్రీరాంపూర్ ఏరియా లో నిర్వహించారు. ప్రవీణ్ కుమార్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోదావరిఖని ఆర్జీ1 కు చెందిన గంగారపు లింగమూర్తిని జనరల్ సెక్రెటరీగా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా గోడ రమేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆరెపల్లి రామచందర్, బాదం వెంకటేష్, కుమార్, హరి, తిరుపతి, నాగయ్య పాల్గోన్నారు.