లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని పెద్దపల్లి చింతకుంట విజయరమణరావు తెలిపారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ రాధాకృష్ణ ఫంక్షన్ హాల్లో ఆదివారం జరిగిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణలో లయన్స్ క్లబ్ ముందుందన్నారు. లయన్స్ క్లబ్ రీజియన్ చైర్ పర్సన్ వేల్పురి సంపత్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.