కాంగ్రెస్ ప్రభుత్వం మెరుగైన పాలన అందిస్తుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం గోదావరిఖని పట్టణంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కోరారు.