పెద్దపల్లి: 14న ఓబీసీ పోరుబాట పుస్తక ఆవిష్కరణ

84చూసినవారు
పెద్దపల్లి: 14న ఓబీసీ పోరుబాట పుస్తక ఆవిష్కరణ
సీనియర్ ఐఏఎస్, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, హైకోర్టు న్యాయవాది పృధ్వీరాజ్ సింగ్ రచించిన ఓబీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ ఈనెల 14 న హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మల్క రామస్వామి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఎల్. రాజయ్య తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో గురువారం మాట్లాడుతూ పుస్తక ఆవిష్కరణ సదస్సుకు పార్టీలకతీతంగా హాజరవుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్