ధర్మారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న బైకని శరణ్య జాతీయ స్థాయి ఫుట్ బాల్ అండర్-19 పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ శనివారం తెలిపారు. నవంబర్ లో 25 నుండి 27 వరకు మహబూబ్ నగర్ జరిగిన ఎస్ జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి ఈనెల 15 నుండి 21 వరకు మణిపూర్ లో ఇంపాల్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టుకు ఆడుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు.